అనురాధా నక్షత్రంలో జన్మించిన జాతకులు ప్రేమ కోసం స్నేహం కోసం ఏమైనా చేస్తారు. నిజాయితీ కోసం ప్రాణమిస్తారు. పౌరుషం ఎక్కువ. అయితే స్నేహితులకు, ప్రేమ కోసం త్యాగాలు చేస్తారు. ఇతరులను ఆదుకోవడంలో ముందుంటారు. అనురాధా నక్షత్రంలో జన్మించిన పురుషులు అందంగా ఆజానుబాహులుగా ఉంటారు. ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వీరి వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది.
నిజాయితీగా శ్రమించేందుకు ఏమాత్రం వెనుకాడని ఈ జాతకులు.. కార్యాలయాల్లో మంచి గుర్తింపు సాధిస్తారు. ఉన్నత పదవులను అధిరోహిస్తారు. వాణిజ్యంలో రాణిస్తారు. వీరికి డ్రగ్స్, కెమికల్, మెడికల్ సెక్టార్లలో రాణిస్తారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతానాన్ని నిజాయితీతో పెంచుతారు. ఈ జాతకులకు ఆస్తమా సంబంధిత శ్వాస వ్యాధులతో ఇబ్బందులుంటాయి. దంత సమస్యలు ఏర్పడతాయి. వైద్యుల సలహాల మేరకు మందులు తీసుకోవడం మంచిది.
ఇకపోతే.. అనురాధా నక్షత్రం ఏ పాదంలో జన్మించిన మహిళలు స్నేహభావం, కలుపుగోలుతనం, అనురాగం, భక్తి, పాతివ్రత్యం, సంపదలు, ఆభరణాలు, సౌమ్య స్వభావం వుంటాయి. అనూరాధలో జన్మించిన పురుషులకు రాజకీయాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో ఆసక్తి, మంచి రూపం, శౌర్యం, పాపభీతి, మహిళల అభిమానం వుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.