ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ప్రీతికమైనది. గీతోపదేశం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ.. నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్రాన్ని గురించి పేర్కొని వున్నారు. అందుకే ఆరుద్ర నక్షత్రానికి ప్రాధ్యాన్యత వుంది. అలాగే ధనుర్మాసం కూడా విశిష్టమైంది. అలా ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు ప్రత్యేకమైనది. శివకేశవుల పూజకు శ్రేష్టమైనది.
అలాగే మాసాల్లో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివపూజ చేయాలి. నటరాజస్వామిని దర్శించుకోవాలి. అర్చన చేయాలి. ఆరుద్ర నక్షత్రం రోజున ఉపవసించి.. గృహంలో పూజలు చేసి.. నైవేద్యం సమర్పించాలి. ఆలయాల్లో జరిగే ఆరుద్ర నక్షత్ర పూజల్లో పాల్గొనాలి. ఆరుద్ర దర్శనం చేయాలి. ముఖ్యంగా సంవత్సరానికి ఆరుసార్లు మాత్రమే నటరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి.