విశాఖపట్టణంలో Google AI కేంద్రం వచ్చేందుకు తాము ఎంతగానో కృషి చేసి రాబట్టామని కూటమి సర్కార్ చెబుతూ వుంటే మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గూగుల్ ఏఐతో కేవలం 200 మందికి ఉపాధి లభిస్తుందని ఎంఓయులో చెప్పి, బైట మాత్రం లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారంటూ గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
ఆయన మాట్లాడుతూ... గూగుల్ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఉద్యోగుల సంఖ్యే 1,80,000 మంది. అలాంటిది విశాఖలో స్థాపించబోయే గూగుల్ డేటా సెంటర్లో అంతమందికి ఉపాధి ఎలా ఇప్పించగలరో చెప్పాలి. ఒకవేళ అదే నిజమైతే గూగుల్ సంస్థతో చెప్పించండి. నేను లోకేష్ గారిని పిలిచి సన్మానం చేస్తాను. కేవలం 200 ఉద్యోగాల కోసం వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తారా. వాస్తవాలను చెప్పకుండా అంతా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అదేమని అడిగితే నాపై ట్రోలింగ్ చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు అమర్నాథ్.