స్త్రీలు గాజులు ధరించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. స్త్రీలు గోరింటాకు, మట్టి గాజులు ధరించడం ద్వారా దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. గాజుల శబ్దం నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని నమ్మకం. అలాగే శుక్రుని బలపరచడానికి గాజులు ఉపయుక్తంగా వుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.