స్కంధ షష్ఠి రోజున కార్తీకేయుడిని నిష్ఠగా పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. స్కంధ షష్ఠి జూలై 30వ తేదీన వస్తోంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన అనుగ్రహం కోరిక తీరుతుందని నమ్మకం.
ఆ రోజున శుచిగా స్నానమాచరించి.. కుమార స్వామిని పూజించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి యధాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈ రోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఆలయాలలో రావిచెట్టు కింద ఉండే నాగప్రతిష్టకు ఈ రోజు సుబ్రహ్మణ్యుని భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్లు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.