తులసీ దేవి స్వీట్స్ నైవేద్యంగా పెడితే ఏంటి ఫలితం?

మంగళవారం, 10 మే 2022 (21:58 IST)
తులసి మొక్క ప్రతి ఇంట్లో తప్పకుండా వుండాలి. అనేక ఔషధ గుణాలున్న తులసి మొక్క విష్ణుమూర్తికి ఇష్టమైన వాటిలో ఒకటి. తులసిలో రెండు రకాలు ఉన్నాయి. అందులో కొద్దిగా నల్లగా ఉండే తులసిని 'కృష్ణ తులసి' అంటారు.  
 
తులసిని ఇంటి ముందు లేదా ఆవరణలో పెంచాలి. ఇంట్లో తులసి కోట ఉంటే దానికి ప్రతిరోజూ పూజ చేయడం తప్పనిసరి. తులసీని శుభ్రంగా వుంచి.. కోట ముందు బియ్యం పిండితో రంగవల్లికలతో అలంకరించాలి. ఆపై ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. నైవేద్యంగా పండ్లు లేదంటే స్వీట్స్ పెట్టవచ్చు.  
 
రోజూ ఉదయం సూర్యోదయానికి ముందు తులసి పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఉదయం ఆరు గంటలకు ముందు తులసీ కోటలో దీపాన్ని వెలిగించాలి. తులసి మొక్కకు మిఠాయిలను నైవేద్యంగా సమర్పిస్తే శుక్ర యోగాన్ని కూడా పొందవచ్చు. 
 
తులసి మొక్కకు ప్రతిరోజూ మితంగా నీరు పోయాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తులసిని పూజిస్తే శకునాల ప్రభావం వుండదు. ఇంటికి తిరిగివచ్చి చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుని తులసిని పూజించడం ద్వారా దుష్ట శక్తులు దరిచేరకుండా వుంటాయి. 
 
రోజూ తులసీ దేవికి పూజ చేయడం ద్వారా పేదరికం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఇంకా శ్రీమన్నారాయణ స్వామి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు