అహంకారం, ఇతరులను మోసం చేయడం అహంకారంగా ప్రవర్తించి ఇతరులను మోసం చేసే ధోరణి ఉన్నవారు జీవితాంతం పేదవారిగా జీవిస్తారని చాణక్య నీతి శాస్త్రం చెప్తోంది. ఇంకా ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలేంటో చాణక్యుల వారు తన నీతి శాస్త్రంలో పేర్కొని వున్నారు.
అవేంటంటే.. ఎవరి ఇంట్లోనైనా స్త్రీలను అవమానించినా, చెడుగా ప్రవర్తిస్తే, సంపదతో పాటు, అలాంటి ఇంటి ప్రజలకు పరువు కూడా ఉండదని చాణక్యులు చెప్పారు. ఎవరి ఇంట్లోనైనా స్త్రీల స్థితి బాగా లేకపోతే, సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి అక్కడ ఎప్పుడూ నివసించదు. కనుక ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మీరు కోరుకుంటే ఇంటిలోని మహిళలతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకూడదు.
అలాగే ఇతరులను మోసం చేసే వారి చేతిలో డబ్బు నిలవదు. నోటికి వచ్చినట్లు ముందు వెనుక చూడకుండా.. పరిస్థితిని అంచనా వేయకుండా మాట్లాడటం వల్ల ఆర్థిక నష్టం తప్పదు. వంటగదిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు.