ఉద్యోగం కోసం శుక్రవారం మాత్రమే కాకుండా శ్రీ మహా లక్ష్మీదేవిని ఎనిమిది పేర్లతో జపించాలి అంటున్నారు పండితులు. ఈ ఎనిమిది నామాలతో శ్రీలక్ష్మిని స్తుతించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నప్పుడు, ఈ ఎనిమిది అద్భుత నామాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
శ్రీ మహా లక్ష్మీ దేవిని రోజూ లేదా శుక్రవారం ఉదయం, సాయంత్రం నిష్ఠతో పూజించే వారికి సంపద, శ్రేయస్సు చేకూరుతుంది. అలాగే మంచి ఉద్యోగం పొందడానికి లక్ష్మీదేవికి చెందిన ఈ ఎనిమిది పేర్లను జపించాలి.