మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. కాంట్రాక్టర్లకు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ప్రయాణాలు, ఖర్చులు, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. క్రీడల పట్ల, దైవదీక్షల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
వృషభం
ఓర్పు, సర్దుబాటు ధోరణితో మెలగటం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ఖర్చులెదురైనా ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి నుంచి శుభవార్తలు వింటారు. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు.
మిథునం
చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు అధికమవుతాయి. ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కొంటారు.
కర్కాటకం
ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా లాభిస్తాయి. దుబారా నివారించలేరు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ పట్టుదల కార్యరూపం దాల్చుతుంది. శారీరక ఆరోగ్యమునందు కొద్దిపాటి మార్పులు వచ్చే సూచనలున్నాయి. ఇరుగుపొరుగువారి మధ్య కలహాలు అధికమవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు.
సింహం
ఎల్ఐసీ, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. విద్యా సంస్థలలో వసతి లభిస్తుంది. ప్రియతములను కలుసుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉద్యోగంలో మానసిక అశాంతి, చికాకులు సంభవిస్తాయి. ప్రేమికుల అనుమానాలు మరింతగా బలపడతాయి. వాహనయోగం పొందుతారు.
కన్య
వృత్తి వ్యాపారస్తులకు అధిక శ్రమ ఉండదు. స్త్రీలకు, పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు, బిల్డర్లు కష్టనష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు.
తుల
వృత్తి పనివారు ఇబ్బందులకు గురవుతారు. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన ధనం అందడంతో మానసికంగా కుదుటపడుతారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి.
వృశ్చికం
వ్యాపార వ్యావహారాల్లో ఉమ్మడి సమస్యలు రావచ్చును. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. గతంలో వాయిదా పడిన పనులు మరల ప్రయత్నించుట వల్ల ముందుకు సాగును.
ధనస్సు
ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల సహాయంతో మీ పనుల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయదారుల లాభాలు గడిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచుతాయి.
మకరం
భాగస్వాములమధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కాంట్రాక్టుదారులకు ఆందోళనలు, కొన్ని సందర్భాలయందు ధన నష్టం సంభవించును. మీ యత్నాలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. వాయిదా పడిన పనులు పునఃప్రారంభిస్తారు.
కుంభం
బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బంధు మిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు.
మీనం
సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. మీ అలవాట్లు బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సాంఘిక, బంధుమిత్రాదులయందు అన్యోన్యత తగ్గును. ఆరోగ్య విషయంలో చికాకులు ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారాల్లో మెలకువ వహించండి.