మేషం : వస్త్ర బంగారు, వెండి లోహ వ్యాపారస్తులకు సామాన్యం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఎదుటివారు చెప్పేమాటను శ్రద్ధగా ఆలకించండి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడుట మంచిది. వినోదాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. భావోద్వేగాలు తరుచూ మారుతూ ఉండొచ్చు.
వృషభం : ఉద్యోగస్తుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన గుర్తింపుతో పాటు ప్రొత్సాహకరమైన ఫలితాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసభరితంగా సాగుతాయి. ఖర్చులు అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు అంచనాలకు మించిన సత్ఫలితాలను సాధిస్తారు.
మిధునం : ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అంతులేని ఆలోచనలను అదుపులో ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు మరికొంతకాలం వాయిదా వేయడం మంచిది. స్వార్థాలు విడనాడితే మంచి సత్ఫలితాలు సాధించగలరు. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత నెలకొంటుంది.
కర్కాటకం : మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. యోగా ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహం : సాటిలేని మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ సంతానం ఉన్నతి కోసం కొత్తకొత్త పథకాలు రూపొందిస్తారు. సాహస కృత్యాలలో పాల్గొంటారు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కన్య : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. విహార యాత్రలకు వెళ్తారు. కొన్ని విషయాల్లో కుటుంబంలో మీ ఆధిపత్యం చెల్లదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాపరుస్తాయి. ఏమరుపాటుగా వాహనం నడపడం వల్ల ఊహించని చికాకులు తలెత్తుతాయి. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
తుల : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. అనూహ్యమైన మార్పులు ఉంటాయి. దగ్గరలో ఉన్న ఓ ప్రాంతాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో శ్రమ, ప్రయాసలెదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
వృశ్చికం : ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. నిరాశ, నిస్పృహల నుంచి బయటపడటానికి ఆత్మీయులతో గడుపుతారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదురవుతాయి. బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన అవకాశం లభిస్తుంది.
ధనస్సు : మీ ఆలోచనలు పంచుకోగల భాగస్వామి తారసపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవల్ల ఆందోళన పెరుగుతుంది.
మకరం : ప్రతిఫలం తక్కువైనా వృత్తుల వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్త్రీలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలిచందు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కుంభం : లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
మీనం : మీరు ఉన్నచోట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవలన ఆందోళన పెరుగుతుంది. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. రాజకీయ నేతలు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.