ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

ఐవీఆర్

మంగళవారం, 15 జులై 2025 (18:18 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్, తమ తొలి 'సిటీస్ ఆన్ ది రైజ్' జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ పరంగా వృద్ధి, ఆర్థిక అవకాశాలు పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాలను వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం, విశాఖపట్నం నెం.1, విజయవాడ నెం. 3లలో వృత్తిపరమైన అవకాశాలు పరంగా వేగంగా వృద్ధి చెందుతున్న టాప్ 3 నాన్-మెట్రో కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. సిటీస్ ఆన్ ది రైజ్ అనేది లింక్డ్ఇన్ యొక్క మొట్టమొదటి లొకేషన్-ఆధారిత ర్యాంకింగ్, ఇది భారతదేశం అంతటా నియామకం, ఉద్యోగ సృష్టి, ప్రతిభలలో వృద్ధిని ఒడిసిపట్టే ప్రత్యేకమైన లింక్డ్ఇన్ డేటా ఆధారంగా రూపొందించబడింది.
 
ఈ సంవత్సరం ఐదుగురు భారతీయ నిపుణులలో నలుగురుకు పైగా ఉద్యోగాలు మారాలని చూస్తున్నందున, ఆర్థిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్న సాంప్రదాయ ప్రధాన నగరాలకు అతీతంగా 'వృద్ది చెందుతున్న నగరాలు'ను దిశానిర్దేశం చేస్తుంది. స్థానికంగా తమ కెరీర్‌లను మార్చుకోవాలని, కొత్త పరిశ్రమలను ప్రారంభించాలని లేదా పెంచుకోవాలని చూస్తున్న నిపుణుల కోసం ఈ జాబితా అభివృద్ధి చెందుతున్న టైర్-2 మరియు టైర్-3 వృద్ధి ప్రాంతాలను హైలైట్ చేస్తుంది.
 
లింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్‌పర్ట్, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ, “టైర్-2 మరియు టైర్-3 నగరాలు భారతదేశ ఆర్థిక పరివర్తనకు కేంద్రంగా ఉన్నాయి. విశాఖపట్నం పారిశ్రామిక శక్తి కేంద్రంగా ఎదుగుతుండగా, విజయవాడ ఐటీ రంగం నుండి పెట్టుబడులను ఆకర్షిస్తుండటంతో, ఈ నగరాలు ఉపాధి మరియు ప్రతిభ ఉద్యమానికి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రం మరియు చుట్టుపక్కల ఉన్న నిపుణులు ఇప్పుడు స్థానికంగా అవకాశాలు, కెరీర్ వృద్ధిని కొనసాగించవచ్చు, అదే సమయంలో కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు, అవి ఉన్న చోట కొత్త అభిరుచులను కనుగొనవచ్చు” అని అన్నారు. 
 
టెక్, ఫార్మా, ఆర్థిక సేవలు అభివృద్ధి చెందుతున్న నగరాలను ప్రతిభ అయస్కాంతాలుగా మారుస్తున్నాయి.
డేటా మరియు ఏఐ విజృంభణ మధ్య, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, ఇంక్ (విశాఖపట్నం), హెచ్‌సిఎల్ టెక్ (విజయవాడ, మధురై), ఇన్ఫోసిస్ (విజయవాడ), డేటామాటిక్స్(నాసిక్), బుల్ ఐటీ సర్వీసెస్(మధురై) వంటి టెక్ కంపెనీలు టైర్-2, టైర్-3 నగరాల్లో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి, స్థానిక ప్రతిభ కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సన్ ఫార్మా వంటి హెల్త్‌కేర్ & ఫార్మా కంపెనీలు విశాఖపట్నం, వడోదరలో అవకాశాలను సృష్టిస్తున్నాయి; హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రాయ్‌పూర్‌లు ఆగ్రా మరియు జోధ్‌పూర్‌లలో ఆర్థిక సేవల వృద్ధిని వేగవంతం చేస్తున్నాయి.
 
విశాఖపట్నం, విజయవాడలో ఇంజనీరింగ్ ఉద్యోగాలలో నియామకాల పెరుగుదలకు దారితీస్తున్నాయి:
విశాఖపట్నం, విజయవాడ, మధురైలలోని నిపుణులకు, ఇంజనీరింగ్ రంగంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి బాధ్యతలలో నాసిక్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, ఆగ్రా, వడోదర, జోధ్‌పూర్‌తో సహా 10 నగరాల్లో 6లో నియామకాలను నిర్వహిస్తున్నాయి. అమ్మకాలు, కార్యకలాపాలు, విద్య అనేవి టైర్-2, టైర్-3 నగరాల్లోని నిపుణులు ఉద్యోగాల కోసం వెతుకుతున్న ఇతర కీలక విధులు.
 
లింక్డ్ఇన్ యొక్క సిటీస్ ఆన్ ది రైజ్ 2025లో ఎంపికైన అగ్రశ్రేణి నగరాల పూర్తి జాబితా ఇక్కడ ఉంది:
1. విశాఖపట్నం
2. రాంచీ
3. విజయవాడ
4. నాసిక్
5. రాయ్‌పూర్
6. రాజ్‌కోట్
7. ఆగ్రా
8. మధురై
9. వడోదర
10. జోధ్‌పూర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు