04-07-2019 గురువారం రాశిఫలాలు : ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి..

గురువారం, 4 జులై 2019 (09:14 IST)
మేషం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కానరాగలదు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు.
 
వృషభం : సన్నిహితుల నుంచి ఆకర్షనీయమైన కానుకలు అందుకుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా వ్యవహరించి పూర్తి చేస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
మిథునం : బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. పాత వస్తువులు కొని సమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం : మీ సంతానం విద్య, వివాహాది విషయాలపై శ్రద్ధ కనబరుస్తారు. కాంట్రాక్టర్లుకు లభించిన టెండర్లు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.
 
సింహం : ఉపాధ్యాయులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యులకు బహుమతులు అంజేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది.
 
కన్య : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బ్యాంక్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి.
 
తుల : ఉద్యోగస్తులు అనవసర విషయాలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఆత్మ విశ్వాసంతో యత్నాలు కొనసాగించడం మంచిది. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. స్త్రీలు పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతంగా ఉండదు.
 
వృశ్చికం : స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
ధనస్సు : వృత్తి, వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. కళాకారులు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. ఏమరుపాటుతనంతో ఉద్యోగస్తులతు ఇబ్బందులు తప్పవు. తప్పనిసరి చెల్లింపులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు.
 
మకరం : స్త్రీలకు టివి కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణలకు అనుమతులు వస్తాయి. శ్రీవారు, శ్రీమతిల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే పరిణామాలు ఎదుర్కుంటారు. ఖర్చులు రాబడికి మించడంతో చేబదుళ్లు, రుణాలు స్వీకరిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కుంభం : ఆర్థికస్థితి కొంత మేర మెరుగుపడుతుంది.బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించాల్సి వస్తుంది.
 
మీనం : స్త్రీలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారులకు సామాన్యం. ఆస్తి విషయంలో సోదరుల నుంచి ప్రతికూలతలు ఎదుర్కొనవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు