05-08-2019- సోమవారం మీ రాశి ఫలితాలు.. ప్రేమికులకు తొందరపాటు నిర్ణయాలు..?

సోమవారం, 5 ఆగస్టు 2019 (10:08 IST)
మేషం: శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయ భేధాలు తలెత్తుతాయి. మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. అతిధి సపర్యలు బాగుగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు బాగుగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సత్‌ఫలాలు నిస్తాయి. 
 
వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు అనుకూలమైన కాలం. కార్మికులకు విశ్రాంతి లోపం వల్ల చికాకులు తప్పవు. స్ధిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పథాకాలలో మెళుకువ అవసరం.
 
మిధునం: ఉద్యోగస్తుల నిర్లక్ష్య ధోరణి వల్ల పై అధికారులతో మాటపడక తప్పదు. పెద్దలు పరోపకారానికి పోవటం వల్ల మాటపడవలసి వస్తుంది. పత్రక, ప్రైవేటు సంస్ధలలోని వారు యాజమాన్యం తీరుకు అనుగుణంగా వ్యవహరించ వలసి ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో పనులు చురుకుగా సాగుతాయి.
 
కర్కాటకం: కంది, మిర్చి, పసుపు, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ప్రేమికులకు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. విదేశాలు వెళ్ళె యత్నాలలో సఫలీకృతులవుతారు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేక పోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
సింహం: వస్త్ర వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులుకు నూతన పరిచయాల వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు.
 
కన్య: ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వస్త్ర, బేకరి వ్యాపారులకు పురోభివృద్ధి. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళుకువ వహించండి.
 
తుల: ఉపాధ్యాయులకు పరస్పర అవగాహానాలోపం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. భాగస్వామ్యల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పాతమిత్రుల కలయికతో సంతృప్తి కానవస్తుంది.
 
వృశ్చికం: మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. రుణాలు ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. బహిరంగ సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. టెక్నికల్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రీకల్ రంగాల్లో వారికి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి.
 
ధనస్సు: ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదరదు. కొన్ని నిర్భందాలకు లోనవక తప్పదు. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు.
 
మకరం: ఆర్థికంగా అభివృద్ధి చేకూరుతుంది. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం.
 
కుంభం: రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. విదేశీ, వాణిజ్యం, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. 
 
మీనం: ఆర్ధిక లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కుంటారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. రవాణా రంగంలోని వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు