06-07-2020 సోమవారం రాశిఫలాలు

సోమవారం, 6 జులై 2020 (05:00 IST)
మేషం : ఆదాయానికి మించిన ఖర్చులున్నా భారమనిపించవు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. వాహనచోదకులకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
వృషభం : మనోధైర్యంతో విద్యార్థులు ముందుకు సాగడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. పోస్టల్, కొరియర్, టెలిగ్రాఫ్ రంగాల వారికి అనుకున్నంత అభివృద్ధి కానరాదు. ప్రైవేటు రంగాలలోని వారు యజమానులను తక్కువ చేసి సంభాషించడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. 
 
మిథునం : విద్యా సాంఘిక, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దలను, ముఖ్యులను దైవజ్ఞులను, పండితులను కలుసుకుంటారు. మీరు పరోక్షంగా చేసే కార్యక్రమాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇన్వర్టర్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానరాగలదు. విదేశాలు వెళ్లాలనే మీ ఆలోచన క్రియారూపంలో పెట్టండి. 
 
కర్కాటకం : పత్రికా రంగాలలో వారికి అనుకోని గుర్తింపు, రాణింపు లభించగలదు. క్రీడాకారులకు ఒత్తిడి, చికాకులు అధికవుతాయి. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు మీ చేతికందుతాయి. 
 
సింహం : వస్త్ర, వస్తువులపట్ల ఆభరణాల పట్ల, స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆదోళన కలిగిస్తుంది. వాణిజ్య రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ముఖ్యుల రాకపోకలు కూడా లభిస్తాయి. 
 
కన్య : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. పెండింగ్ వ్యవహారాలలో కూడా పురోభివృద్ధి పొందుతారు. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. 
 
తుల : రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ఆల్కహాలు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ కళత్ర, మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృశ్చికం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులకు యజమాన్యం ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
ధనస్సు : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మనుష్యుల మనస్తత్వం తెలిసి మసలు కొనుట మంచిది. పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మకరం : ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. మిత్రుల కారణంగా మీ పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. 
 
కుంభం : వృత్తుల, చిరు వ్యాపారులకు సదావకాశాలు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మీనం : రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. మీ సాధనలో కొన్నిసార్లు వైఫల్యం తలెత్తినా ధైర్యంతోనూ తెలివితోనూ, ఎదుర్కొండి. వారసత్వపు వ్యవహారాలలో కొన్ని సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. స్త్రీలకు బంధువర్గాలతోనూ, చుట్టుపక్కల వారితోనూ పట్టింపులేర్పడతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు