06-08-2019 మంగళవారం దినఫలాలు - కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు

మంగళవారం, 6 ఆగస్టు 2019 (09:04 IST)
మేషం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు అలంకరణలు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికం. తలపెట్టిన పనుల్లో జాప్యం, ఒత్తిడి ఎదుర్కుంటారు. 
 
వృషభం: వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీ సమస్యలకు ఆత్మీయుల నుంచి చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. గృహ నిర్మాణానికి కావలసిన ప్లానుకు ఆమోదం లభిస్తుంది. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. 
 
మిధునం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీరే చూసుకోవటం మంచిది. స్త్రీలు దంతాలు, నరాలకు సంబంధించిన చికాకు లెదుర్కోవలసివస్తుంది.
 
కర్కాటకం: నూతన వ్యాపారాల్లో ఆటంకాలు క్రమేణా తొలగిపోగలవు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు చేయవలసి వస్తుంది. మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఒక స్థిరాస్తి విక్రయించే విషయంలో పునరాలోచన మంచిది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకువస్తాయి.
 
సింహం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగం చేసే మహిళలకు చికాకులు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. మొండి బాకీలు వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
కన్య: విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఏ వ్యవహారమూ కలిసి రాకపోవడంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. 
 
తుల: మీ జీవిత భాగస్వామి సలహా పాటిస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరుగడంలో అదనపు రాబడిపై అన్వేషిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు గురిచేస్తాయి.
 
వృశ్చికం: సహోద్యోగులతో సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉమ్మడి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. మీ సంతానం వైఖరి చికాకు కలిగిస్తుంది. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
ధనస్సు: బ్యాంకు పనులు వాయిదా పడతాయి. స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలను చేజార్చుకుంటారు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కుంటుంబములో ప్రశాంతత చోటు చేసుకుంటుంది. 
 
మకరం: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప ఆస్వస్థతకు గురవుతారు. సమయానికి మిత్రుల సహకరించకపోవటంతో అసహానానికి గురవుతారు. 
 
కుంభం: ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
 
మీనం: హోటల్, క్యాటరింగ్, తినుబండారు వ్యాపారులకు కలిసివస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. ప్రయాణాలలో అసౌకర్యానికి లోనవుతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలతం. వాహన చోదకులకు ఊహంచని ఆటంకాలెదురవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు