08-08-2020 శనివారం రాశిఫలాలు - ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని...

శనివారం, 8 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. హామీలు, చెక్కులజారీలో పునరాలోచన మంచిది. రాజకీయాలలోని వారికి పార్టీపరంగా అన్ని విధాలా గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
వృషభం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు ఉండవు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిదని గమనించండి. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ సంకల్పం నెరవేరగలదు. ఉమ్మడి వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఖర్చులు అధికం. 
 
కర్కాటకం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిత్యావసర వస్తు సరకుల స్టాకిస్టులకు వేధింపులు తప్పవు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఏ విషయంలోనూ తొందరపడక నిదానించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 
 
సింహం : స్త్రీలకు విలాసవస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహం. మీ కళత్ర మొండివైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్సాంతిని దూరం చేస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. 
 
కన్య : పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. కొన్ని సందర్భాల్లో అనాలోచితంగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. అవగాహన లేని విషయాలు దూరంగా ఉండటం క్షేమదాయకం. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. 
 
తుల : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. బంధువుల రాకవల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు. ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. 
 
వృశ్చికం : ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహనలేక మనస్పర్థలు రావచ్చును. స్థిరబుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరాడుతారు.
 
ధనస్సు : ఏదన్నా అమ్మకానికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. అధిక మొత్తంలో రుణం చేయవలసి వస్తుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. 
 
మకరం : దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. క్రయ, విక్రయ రంగంలోని వారికి మెళకువ అవసరం. 
 
కుంభం : ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. ఇతర విషయాలపై ఆసక్తిని తగ్గించి, స్వవిషయాలపై శ్రద్ధపెడితే మంచిది. చేతి వృత్తుల, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం నెలకొంటుంది. 
 
మీనం : ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. మీరు మీ సొంతానికి కాకుండా ఇతరులకు ఉపయోగపడతారు. మాట తొందర వల్ల కొంతమంది మనసు నొప్పించే అవకాశం ఉంది. వ్యాపారులు, ప్రత్యర్థుల గురించి ఆందోళన చెందుతారు. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు