మంగళవారం (12-11-2019) దినఫలాలు - ఓర్పు, నేర్పుతో అనుకున్న పనుల్లో...

మంగళవారం, 12 నవంబరు 2019 (09:24 IST)
మేషం : విద్యార్థులకు లా, ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. స్థిరచరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. శ్రీమతి ప్రోద్భలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు. దైవ, సేవ, పుణ్య కార్యాలకు ఇతోధికంగా ధనసహాయం అందిస్తారు.
 
వృషభం : కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మీ వ్యవహార దక్షతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. ప్రముఖుల కలయిక వల్ల ఏ మాత్రం ఫలితం ఉండదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
మిథునం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, విత్తనాల వ్యాపారులకు కలిసిరాగలదు. ఓర్పు, నేర్పుతో అనుకున్న పనుల్లో జయం సాధిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
కర్కాటకం : ఉద్యోగస్తులు, ఉన్నతస్థాయి అధికారులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు కొత్త వాతావరణం, పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు.
 
సింహం : ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఎల్ఐసీ ఫిక్సెడ్ డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికందుతుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
కన్య : రియల్ ఎస్టేట్ రంగాల వారికి, బిల్డర్లకు ఆశాజనకం. వాహనం, విలువైన  వస్తువులు అమర్చుకుంటారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఖర్చులు, చెల్లింపులు అధికం.
 
తుల : ఒకానొక విషయంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూలమవుతాయి. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమించి అనుభవం గడిస్తారు.
 
వృశ్చికం : కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించక తప్పదు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, విస్తరణల విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరు చూసుకోవడం శ్రేయస్కరం.
 
ధనస్సు : ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక పొరపాటు దొర్లే ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలకు అనుకూలం. మీ సంతానం పై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. వాణిజ్య ఒప్పందాలు, బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో ఏకాగ్రత అవసరం.
 
మకరం : భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు, వస్త్ర వ్యాపారులకు ఆశాజనకం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
కుంభం : కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమించి అనుభవం గడిస్తారు. మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార రహస్యాలు గోప్యంగా ఉంచండి. భాగస్వామిక చర్చలు అనుకున్నంత ప్రశాంతంగా సాగవు. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకోవడం మంచిది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
 
మీనం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. సభ, సన్మానాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు సంతృప్తినిస్తాయి. ప్రైవేట్ సంస్థలలోని వారికి యాజమాన్యం నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు