17-09-2019- మంగళవారం దినఫలాలు - సోదరులతో సంబంధ బాంధవ్యాలు..

మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (08:56 IST)
మేషం: రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. స్త్రీలు టి. వి., ఛానల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు.
 
వృషభం: భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయబేధాలు భిన్నంగా ఉంటాయి. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఎదుటివారి వేషధార చూసి మోసపోయే ఆస్కారం ఉంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు.
 
మిధునం: సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సోదరుతో సంబంధ బాంధవ్యాలు బాగుగా కలిసివస్తాయి. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వైజ్ఞానిక శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధిమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
సింహం: మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి.
 
కన్య: మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. పట్టుదలతో శ్రమిస్తేకానీ పనులు నెరవేరవు. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది.
 
తుల: ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మకంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోటులు తప్పవు. ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. 
 
వృశ్చికం: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది.
 
ధనస్సు: ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం ఆలస్యంగా చేతి కందుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సామాన్యం. 
 
మకరం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కుంభం: పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణి వల్ల సదవకాశాలు జారవిడుచుకుంటారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక ముఖ్య వ్యవహారమై దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం మీ అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది.
 
మీనం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవలన జయం చేకూరుతుంది. నిర్మాణ పనుల్లో పనివారితో సమస్యలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు