23-09-2019 సోమవారం మీ రాశిఫలాలు - నిరుద్యోగులకు చేజారిన...

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:21 IST)
మేషం: పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. విలువైన కానుక ఇచ్చి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
వృషభం: రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పుచాలా అవసరం. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు.
 
మిధునం: ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు చాలా అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు.
 
కర్కాటకం: ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిదికాదు. నిరుద్యోగులకు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనాలు అనుకూలిస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షీతులౌతారు. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
సింహం: ఉద్యోగస్తులు ఎదుటివారి తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కన్య: బంధువులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు మెళుకువ వహించండి. సోదరి, సోదరుల పోరు అధికంగా ఉంటుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
తుల: రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. ప్రయాణాల్లో తొందర పాటుతనం అంత మంచిది కాదని గమనించండి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చు కోవలసివస్తుంది.
 
వృశ్చికం: బంధువులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు: మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. కొన్ని విషయాల్లో నిగూఢంగా ఉండండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
మకరం: మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఊహించని చికాకు లెదురవుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం కూడదు. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. దైనందిన జీవితంలో స్వల్ప మార్పులు జరుగుతాయి. నూతన వస్తువులు పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
కుంభం: విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి.
 
మీనం: పెద్దల ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత బాగా అవసరం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. రుణప్రయత్నం వాయిదా పడగలవు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు