26-09-2019- గురువారం మీ రాశి ఫలితాలు.. లక్ష్యసాధనకు పట్టుదల ముఖ్యం

గురువారం, 26 సెప్టెంబరు 2019 (10:30 IST)
మేషం: చిన్నతరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ధనం బాగా వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తిచేస్తారు.
 
వృషభం: లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యం. అవకాశాలు అందినట్టే చేజారి పోతుంటాయి. వైద్యులకు సమస్యలు, ప్లీడర్లకు ప్రోత్సాహం కానవస్తుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. ఉమ్మడి వ్యవహారాలు, భాగస్వామిక వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మిధునం: వృత్తివ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. పాత బాకీలు చెల్లిస్తారు. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. అతిగా సంభాషించడం వల్ల ఏర్పడే అనర్థాన్ని మీరు గుర్తిస్తారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం: కళా, క్రీడా రంగాల్లో వారు అనుకోని గుర్తింపు పొందుతారు. రావలసిన ధనం అందుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. వ్యవసాయ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు.
 
సింహం: మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. స్పెక్యులేషన్ రంగాల వారికి కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆకస్మిక ఖర్చులు తప్పవు. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వల్ల భంగపాటు తప్పదు.
 
కన్య: ఉద్యోగయత్నంలో బిడియం, భేషజం తగదు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. కిరాణా, ఫాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. ధనం  మితంగా వ్యయం చేయండి. ఆలయాలను సందర్శిస్తారు. మీ మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
తుల: వస్త్ర, బంగారం, ఫాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, ఓర్పు అవసరం. ఆకస్మికంగా ప్రయాణం తలపెడతారు. ధనానికి ఇబ్బంది లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. 
 
వృశ్చికం: వ్యవసాయ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెళుకువ వహించండి. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు అధికం అవుతాయి. 
 
ధనస్సు: అతిగా సంభాషించడం వల్ల ఏర్పడే అనర్థాన్ని ఈ మాసం మీరు గుర్తిస్తారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచిది. వృత్తి వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి. కుటుంబీకుల నుండి, మిత్రుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం. వ్యాపారాల విస్తరణకు కొంత జాప్యంతప్పదు.
 
మకరం: వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికం, ఎంతో కొంతపొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలించదు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు చోటుచేసుకుంటాయి. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.  
 
కుంభం: ఉద్యోగస్తులకు ఉత్సాహ వాతారణం నెలకొంటుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం. చిన్నతరహా, వృత్తి వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబీకుల ప్రేమాభిమానాలు పొందగలుగుతారు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలక్కి వస్తాయి. 
 
మీనం: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. స్త్రీలు కండరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరిస్తి లేదా వాహనాలు కొనుగోలు చేసే విషయంలో ఆచి, తూచి వ్యవహరించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు