27-09-2019- శుక్రవారం మీ రాశిఫలాలు

శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (10:00 IST)
మేషం: కొబ్బరి, పండ్లు, పూలు, పానియ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. విద్యార్థులకు హడావుడి, ఆందోళన అధికమవుతాయు. మీ శ్రీమతి సలహా పాటించకపోవటం వల్ల చికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికం.
 
వృషభం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు బంధువుల తీరు ఆందోళన కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వేళతప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు.
 
మిధునం: ఉద్యోగస్తులకు బంధువుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కర్కాటకం: ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పుడుతుంది. గతంలో ఒకరికిచ్చినహామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెదురవుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
సింహం: స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది.
 
కన్య: ఉద్యోగస్తులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. డబ్బుపోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
 
తుల: నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించడం మంచిది. మీ మంచితనాన్ని త్వరలోనే కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
వృశ్చికం: రాజకీయనాయకులకు ప్రయాణాలు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు యత్నాల్లో సఫలీకృతులౌతారు. ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవటం క్షేమదాయకం. సహోద్యోగుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
ధనస్సు: శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. కాంట్రాక్టర్లకు బిల్డర్లకు నిర్మాణ పనులలో పనివారలతో చికాకులు తప్పవు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు.
 
కుంభం: బ్యాంకు పనులు పూర్తి చేస్తారు. ధనం ఎంత వస్తున్నా నిల్వచేయలేక పోతారు. ఆస్తి వ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. దేవాలయ, విద్యాసంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు మరి కొంతకాలం వాయిదా వేయటం మంచిది.
 
మీనం: దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులకు సహాయ సహకారాలు అందిస్తారు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు