వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఒత్తిడి, శ్రమ అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి, రాబడిపై దృష్టిసారిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ద్వితియార్థం ఆశాజనకం. కొన్ని సమస్యలు సద్దుమణిగిపోతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు.
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయుల కలయికతో సమస్యలెదురవుతాయి. ముఖ్యమైన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది.
సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మనోధైర్యంతో వ్యవహరించండి. యత్నాలు విరమించుకోవద్దు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. కళాకారులకు ప్రోత్సాహకరం. పందాలు, పోటీల్లో ఉల్లాసం కలిగిస్తాయి.
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం. పుష్యమి, అశ్లేష
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆచితూచి వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.
సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
ఈ మాసం శుభదాయకమే. నిజాయితీని చాటుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం కదలికలపై దృష్టిసారించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు శుభదాయకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పందాలు, క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు.
ఆదాయం బాగుటుంది. సమస్యలు సద్దుమణిగిపోతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. కళ, క్రీడాపోటీల్లో రాణిస్తారు. ప్రయాణం తలపెడతారు.
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలు కలిసివస్తాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం దూకుడును అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దైవ, సేవ సంస్థలకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సమర్థతకు గుర్తింపు ఉండదు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలుంటాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. గృహమార్పు చికాకు పరుస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం.
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. మనోధైర్యంతో వ్యవహరించండి. సన్నిహితుల సాయం అందుతుంది. వేడుకలకు హాజరవుతారు. ప్రియతముల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దైవ, సైవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధన సమస్యలెదురవుతాయి. పొదుపు ధనం ముందుగానే స్వీకరిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. విలువైన వస్తువుల మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. మీ మాటకు తిరుగుండదు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు చూసీచూడనట్టుగా వదిలివేయాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. తీర్థయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి.
ఈ మాసం యోగదాయకం. సమస్యలు కొలిక్కివస్తాయి. మానసికంగా కుదుటపడతారు. రావలిసిన ధనం అందుతుంది. గృహంలో ప్రశాంతత ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం ఉన్నాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.