నవంబరు నెల మాస ఫలితాలు .. మీ ఖర్చులు... గృహమార్పు...

గురువారం, 31 అక్టోబరు 2019 (19:52 IST)
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. 
ఈ మాసం నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అకారణ కలహం, బంధుమిత్రులతో పట్టింపులెదురవుతాయి. సంప్రదింపులు ముందుకుసాగవు. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. మనోధైర్యంతో ముందుకుసాగాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. పనులు అతికష్టంమ్మీద సానూకూలమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు స్థానచలనం. వనసమారాధనలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. 
 
వృషభరాశి : కృత్తికి 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. 
పట్టుదలతో వ్యవహరించండి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. గృహమార్పు అనివార్యం. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. సహాయం ఆశించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సన్నిహితుల హితవు మంచి ప్రభావం చూపుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. యత్నాలను విరమించుకోవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఆటంకాలెదురవుతాయి. యత్నాలను విరమించుకోవద్దు. ఉద్యోస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతనవుండదు. రుణ ఒత్తిడి అధికం. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడుతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాభివృద్ఘికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు మంచి ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. 
అన్ని రంగాల వారికి శుభదాయకమే. కార్యం సిద్ధిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఖర్చులు సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పరిచయాలు బలపడతాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్నాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరకు నిల్వలో జాగ్రత్త. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వాహనచోదకులకు దూకుడు తగదు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. 
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. శుభకార్యంలో పాల్గొంటారు. మీ రాక బంధుమిత్రులను సంతోషపరుస్తుంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. అనవసర జోక్యం తగదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక చర్యలు ఫలిస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. 
అన్ని రంగాల వారికి బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. సాధ్యంకాని హామీలివ్వవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వన సమారాధనలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఈ మాసం ప్రధమార్థం ఆశాజనకం. కష్టం ఫలిస్తుంది. పదవులు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వ్యాపకాలు పెంపొందుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనచోదకులకు సమస్యలెదురవుతాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట. 
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆధిక్యత ప్రదర్శించవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వనసమారాధనల్లో పాల్గొంటారు. క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
ధనుర్‌రాశి: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంప్రదింపులు ఫలించవు. మీపై శకునాల ప్రభావం అధికం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వైద్య, న్యాయ, సేవారంగ వారికి ధనయోగం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుకూలం. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టం ఫలిస్తుంది. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. కనిపించకుండాపోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపు ధనం అందుతుంది. పెద్దమొత్తం సాయం తగదు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
గృహమార్పు కలిసివస్తుంది. వివాహయత్నాలు సాగిస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యవహారానుకూలత ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనయోగం, వాహన సౌఖ్యం ఉన్నాయి. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. మానసికంగా కుదుటపడుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులు ఫలిస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వేడుకల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, విశ్రాంతి లోపం. ఆస్తి, న్యాయ వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. 
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. లౌక్యంగా వ్యవహించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిపెడతారు. ఆత్మీయుల సాయం అందుతుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగాలి. బంధువులతో రెట్టింపులెదురవుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వివాదాలు కొలిక్కివస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు