పగటి పూట కూడదు.. అసలు రహస్యం ఏమిటి?

మంగళవారం, 11 జూన్ 2019 (18:32 IST)
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించడం ఉత్తమమైన మార్గం. ప్రకృతి పరమైన మార్పు కారణంగా రాత్రిపూట చల్లని వాతావరణం నిద్రకు మేలు చేస్తుంది. భూమి ఉష్ణోగ్రత రాత్రిపూట తగ్గడం చేస్తుంది. రాత్రిపూట నిద్రించడం ద్వారానే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. నిద్రకు రాత్రిపూట ఎంత ఉత్తమం అనే దానిపై సిద్ధులు కొన్ని సూచనలు చేసి వున్నారు. అవేంటో చూద్దాం.. 
 
రాత్రిపూట నిద్రపోకుండా వుండే వారిలో బుద్ధిమాంద్యం, చురుకుగా వుండకపోవడం, జ్ఞానేంద్రియాలలో అలసట, భయం, ఆందోళన, అజీర్తి వంటి రుగ్మతలు తప్పవు. అలాగే తూర్పు వైపు తలవుంచి నిద్రించడం మంచిది. దక్షిణం వైపు తల వుంచి నిద్రిస్తే.. ఆయుర్దాయం పెరుగుతుంది. పడమటి దిక్కున మాత్రం తలపెట్టి నిద్రించకూడదు. 
 
ఉత్తరం వైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలపెట్టి నిద్రపోవడం చేయకూడదు. అలాగే వెల్లకి పడుకోకూడదు. ఇలా చేస్తే శరీరానికి ఆక్సిజన్ అందకపోవడం ద్వారా గురక తప్పదు. ఎడమచేతికి కింద, కుడిచేతిని పైన వుంచి.. కాళ్లను బాగా సాచి నిద్రించడం ద్వారా కుడిచేతి ముక్కు ద్వారా శ్వాస ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. 
 
ఆయుర్దాయం పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే పగటి పూట నిద్ర శరీర ఉష్ణోగ్రతలను పెంచేస్తుందని.. అప్పటి వాతావరణం నిద్రకు తగినది కాదని వారు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు