పురుషులు తక్కువ నిద్రపోతే అది తగ్గిపోతుంది...

బుధవారం, 5 జూన్ 2019 (21:16 IST)
ప్రతిరోజు రాత్రి కంటి నిండా నిద్రపోతే రోజంతా ఉత్సాహంగా మన పనులు జరిగిపోతుంటాయి. కానీ నిద్ర సరిగా పట్టకపోతే మాత్రం అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నీరసం, నిసత్తువ, చిరాకు లాంటి సమస్యలు ఎదురవుతాయి. పడుకోగానే రకరకాల సమస్యలు, వాటిని గురించిన ఆలోచనలు లాంటివి కూడా నిద్రలేమికి కారణమవ్వచ్చు. ఈ నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా, వివాహమయిన పురుషుల్లో నిద్రలేమి ఉండడం అనేది వారి శృంగార సామర్థ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. 
 
తగినంత నిద్ర లేకపోతే వీర్యకణాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆధునిక జీవన విధానం ద్వారా తక్కువ నిద్రకు చాలామంది అలవాటుపడిపోతున్నారు. బయటి పనుల ఒత్తిడితో ఏ అర్థరాత్రి వేళకో ఇంటికి చేరుకోవడం మళ్లీ తెల్లవారకముందే ఉరుకులు పరుగుల మీద జీవన సమరాన్ని ప్రారంభిస్తున్న నేటి తరం యువతలో సంతాన సాఫల్యత తగ్గిపోతుందట. 
 
రోజూ చాలినంత నిద్రలేకపోయినా, కొన్ని గంటల పాటే నిద్రపోయినా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని, నాణ్యత కూడా తగ్గుతుందని ఓ అధ్యయనం తేల్చింది. ఇరవయ్యేళ్ల ప్రాయంలో ఉన్న కుర్రకారుపై అధ్యయనం జరిగింది. మై హెల్త్‌ న్యూస్‌ డైలీ ప్రచురించిన వివరాల ప్రకారం.. నాలుగు వారాల పాటూ ఈ కుర్రాళ్లు నిద్రపోయిన సమయం నమోదు చేసి, ఆ రోజుల్లో వారి రక్తంలోని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లెవల్స్‌, వీర్యం పరీక్షించారు. నిద్ర తక్కువ ఉన్న వారిలో 25 శాతం వరకు వీర్యం తగ్గినట్లు గుర్తించారు. దీంతో వారిలో సంతాన సాఫల్యత తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి సంతాన సమస్యతో బాధపడే పురుషుల్లో నిద్రలేమి సమస్య ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవలసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు