ఇక నిద్రపోతూ గేమ్ ఆడొచ్చు.. అదరగొడుతున్న పొక్‌మన్ స్లీప్..
శుక్రవారం, 31 మే 2019 (13:40 IST)
అవును.. ఇకపై నిద్రపోతూ గేమ్ ఆడవచ్చునని ఆన్‌లైన్ గేమ్ సంస్థ పొక్‌మన్ స్లీప్ వెల్లడించింది. గత 2016వ సంవత్సరం పొక్‌మన్ గేమ్ ప్రారంభమైంది. ఈ గేమ్‌కు నెటిజన్ల మధ్య యమాక్రేజ్ వుంది.
ఈ గేమ్ ఆడుతూ కాలాన్ని గడిపేవారి సంఖ్య భారీగా పెరిగిపోతూవుంది. ఈ నేపథ్యంలో పొక్‌మన్ గేమ్‌లో కొత్త యాప్ గేమ్‌ను సదరు సంస్థ పరిచయం చేసింది. పొక్‌మన్ స్లీప్ అనే కొత్త గేమ్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ఆన్‌లైన్ గేమ్ ఈ గేమ్ ఆడేవారి నిద్రించే పద్ధతిని అనుసరిస్తుంది. ఇంకా ప్లేయర్స్ నిద్రించే సమయాన్ని పోల్చి.. పొక్‌మన్‌లను సేకరించడం ద్వారా.. పొక్‌మన్‌ల సంఖ్య పెరిగేలా చేస్తుంది.
అంతేగాకుండా ఆన్ లైన్ గేమ్ ఆడి నిద్రను పోగొట్టుకుంటున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో.. పొక్‌మన్ సంస్థ ఈ కొత్త గేమ్‌ను పరిశీలిస్తుంది. ఈ గేమ్ ద్వారా ఆన్‌లైన్ గేమ్ ప్రియులకు మంచి నిద్ర ఆవశ్యకతను ఈ గేమ్ తెలియచేస్తుంది.
ఇలా పొక్‌మన్ స్లీప్.. ఆన్‌లైన్ గేమ్ ప్రియుల ఆరోగ్యాన్ని కాపాడుతోందని సదరు సంస్థ ప్రకటించింది. ఈ గేమ్ 2020లో ఆన్‌లైన్‌లోకి వస్తుందని పొక్‌మన్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.