మహిళలూ పాదాలకు పసుపు రాస్తున్నారా? ఇవన్నీ చేస్తే?

మంగళవారం, 26 జులై 2022 (14:16 IST)
అమావాస్య, ఆదివారం, అష్టమి రోజుల్లో మహిళలు దుర్గాస్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్లడం.. భైరవునికి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మహిళలు నిద్రలేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలచుకుని పడక దిగాలి. నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమః శివాయ అని తలచుకుంటే మంచే జరుగుతుంది. 
 
ఇంకా మహిళలు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారి సాయం చేయకూడదు. పండగ రోజుల్లో లేదా మంగళ, శుక్రవారాల్లో పాదాలకు పసుపు రాసుకోవాలి. ముఖానికి వారానికి ఓసారైనా పసుపు రాయాలి. నిత్యం దీపారాధన చేయాలి. అమంగళం పలకకూడదు. ఓం దుం దుర్గాయే నమః అంటూ నిరంతం జపించుకుంటూ వుంటే శుభం జరుగుతుంది. 
 
అలాగే  మహిళలు స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలు తొలగిపోతాయి. తలస్నానం చేశాక వారానికి ఒకసారైనా తలవెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు