Kamika Ekadashi 2025: కామిక ఏకాదశిని మిస్ చేసుకోకండి.. తులసీ ముందు నేతి దీపం వెలిగిస్తే?

సెల్వి

సోమవారం, 21 జులై 2025 (10:21 IST)
Kamika Ekadasi
కామిక ఏకాదశి రోజున శ్రీహరిని పూజించటం ద్వార అనంత కోటి పుణ్య ఫలాలను పొందవచ్చు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం కాశీలో గంగా స్నానం కంటే.. హిమాలయాల్లో వుండే కేదారనాథుని దర్శనం కంటే, సూర్య గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కంటే గొప్పది. 
 
కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడకు గ్రాసమును దానం చేయడం వల్ల సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. కామిక ఏకాదశి వ్రతమాచరిస్తే మోక్షాన్ని పొందవచ్చు. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. తులసి కోట ముందు నేతితో దీపం వెలిగించే వారి పాపాలను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడని విశ్వాసం. 
 
కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపాన్ని తొలగించే శక్తి వుందని బ్రహ్మ నారదునితో చెప్పినట్లు శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. అలాగే ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ కామిక ఏకాదశి రోజున కొన్ని దానాలు చేయడం వలన డబ్బులకు ఇబ్బందులు తీరతాయి. 
 
కామిక ఏకాదశి నాడు మీరు మూడు వస్తువులను దానం చేయగలిగితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి సంపదను పొందవచ్చు. ఇందులో అన్నదానం, నువ్వుల దానం, పసుపు వస్త్రాలు దానం చేయాలి. ఇలా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్క వచ్చునని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు