9-6-17 రాశి ఫలితాలు.... శత్రువులు కూడా మిత్రులుగా మారుతారా?
గురువారం, 8 జూన్ 2017 (17:44 IST)
మేషం
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఇతరులు మిమ్మలను చూసి అపోహపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
వృషభం
ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. గత కొంతకాలంగా కుటుంబంలోని వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో జాగ్రత్త వ్యవహరించండి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
మిథునం
వస్త్ర, బంగారు, వెండి రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ సంతానంపై చదువుల విషయమై బాగా శ్రమిస్తారు. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మీ ధైర్య సాహసాలకు కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది.
కర్కాటకం
రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. స్త్రీలకు షాపింగ్‌లోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ప్రధానం. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
సింహం
పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. వాహనచోదకులకు ఊహించని ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు పోవడం వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు. ఒక యత్నం ఫలించడంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు.
కన్య
ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. రాబోయే ఖర్చులకు తగినట్టుగా ఆదాయం పెంచుకుంటారు.
తుల
కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడతాయి. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది.
వృశ్చికం
ఎల్ఐసీ, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజాధారణ అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి.
ధనస్సు
ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. ఏసీ, కూలర్ మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సృజనాత్మకశక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది.
మకరం
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రావలసిన ధనం అందటంతో ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. దైవ, సేవా పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు.
కుంభం
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. షేర్ల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ప్రేమికుల అతి ఉత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యహరిస్తారు.
మీనం
ఆర్థిక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలలిస్తాయి. స్త్రీలు, ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. ఖర్చులు, చెల్లింపులు విషయంలో ఏకాగ్రత వహించండి.