కార్తీక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయలో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు.
ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.
అంతేగాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిదానం చేస్తే.. భూమండలానికి ప్రభువు అవుతారని, దారిద్ర్యం తొలగిపోతుందని విశ్వాసం. అలాగే ఇంటి ముందు తులసీ కోట వద్ద ఉసిరికాయతో దీపమెలిగిస్తే కోరిక కోర్కెలు నెెెరవేరుతాయని భక్తుల ప్రగాణ నమ్మకం.