పిల్లలకు దృష్టి అనేది సులభంగా తగులుతుంది. పిల్లలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. వారికే తెలియకుండా వారి దృష్టి లోపం పిల్లలపై పడుతుంది. ఫలితంగా పిల్లల్లో నలత, జ్వరం, జలుబు వంటి రుగ్మతలు ఏర్పడుతాయి.
ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి.. పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే.. కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని.. పిల్లలను మూడు సార్లు తిప్పి.. పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని.. విశ్వాసం.