24-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. విలాసాలకు వ్యయం చేస్తారు...

రామన్

శుక్రవారం, 24 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులువుతారు. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. బంధువులతో విభేదిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త యత్నాలు చేపడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లలకు శుభం జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు సాగవు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అయిన వారి వైఖరిలో మార్పు వస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం నెరవేరుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి.. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వాయిదా పడిన పనులు ఎట్టలకేలకు పూర్తవుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కలిసివచ్చే సమయం. పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పత్రాలల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ కష్టం వృధా కాదు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు క్రియా రూపం దాల్చుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. నిలిపి వేసిన పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్ష స్వీకరిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు కృషి ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పనులు ఒక పట్టాన సాగవు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. రుణసమస్య నుంచి బయటపడతారు. అవసరాలు తీరుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ధైర్యంగా యత్నాలు సాగించండి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. ఆత్మీయులు సాయం అందిస్తారు. ఒక సమస్య సానుకూలమవుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను నమ్మవద్దు. ఆత్మీయుతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు వేగవంతమవుతాయి. అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. బెట్టింగులకు పాల్పడవద్దు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు