23-10-2025 గురువారం దినఫలాలు - కష్టేఫలి అన్న సత్యాన్ని గుర్తిస్తారు...

రామన్

గురువారం, 23 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. ఖర్చులు సామాన్యం. ఆశించిన వివాహ సంబంధం కలిసిరాదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ముఖ్యుల కలయక సాధ్యపడదు. పనులు హడావుడిగా ముగిస్తారు. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ వాక్కు ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ రోజు కలిసివస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితుల పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నింటా మీదే పైచేయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. పనులు వేగవవంతమవుతాయి. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో శ్రమించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. దుబారా ఖర్చులు విపరీతం. రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ఆప్తులు సాయం అందిస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విమర్శలు పట్టుదలను రేకెత్తిస్తాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శనివారం నాడు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. భేషజాలకు పోవద్దు. నోటీసులు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కష్టేఫలి అన్న సత్యాన్ని గుర్తిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వాగ్ధాటితో రాణిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. మీ జోక్యం అనివార్యం. ఖర్చులు సామాన్యం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. మీ శ్రమ వృధా కాదు. పొదుపు ధనం గ్రహిస్తారు. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులను ఆదుకుంటారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. అప్రమత్తంగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పరిచయస్తులే మోసగించేందుకు యత్నిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పరిచయాలు బలపడతాయి. శుక్రవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధన వ్యయంలో జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆప్తుల సలహా పాటించండి. పనులు ముందుకు సాగవు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు తప్పవు. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆకస్మికంగా ఎదురైన సమస్యను ధైర్యంగా ఎదుర్కుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు