కార్తీక పౌర్ణమి రోజున చాలా ప్రాంతాల్లో 365 వత్తులు వెలిగించుకునే ఆనవాయితీ ఉంటుంది. ఈ వత్తులు సంవత్సరంలో ఒక్కో రోజును సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి ఉదయం విష్ణువు మత్స్య రూపానికి తులసిని సమర్పించి, సత్యనారాయణ కథను విని, పంచామృతంతో అభిషేకం చేసి, శివుడికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి.
లక్ష్మీదేవికి, తులసి చెట్టుకు నెయ్యి దీపం వెలిగించాలి. తులసికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి. పసుపు, కుంకుమలతో దీపారాధన చేయాలి. పౌర్ణమి రోజున అన్నదానం, వస్త్రాలు, పాదరక్షలు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. అప్పులు తొలగిపోతాయి. ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.