సోమవారం కూడా కార్తీక పౌర్ణమి.. సాయంత్రం పూట దీపాలు?

ఆదివారం, 26 నవంబరు 2023 (21:42 IST)
ఈ సంవత్సరం నవంబర్ 26, 27 తేదీల్లో కార్తీక పౌర్ణమి ఉంది. ఇది నవంబర్ 26, 2023 ఆదివారం మధ్యాహ్నం 3:53కి ప్రారంభమవుతోంది. తిరిగి నవంబర్ 27, 2023 సోమవారం మధ్యాహ్నం 02:45కి ముగుస్తుంది. అందువల్ల కొంతమంది ఆదివారం కార్తీక పౌర్ణమిని చేశారు. మరికొందరు సోమవారం చేస్తున్నారు. 
 
సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి.. సోమవారం ఉదయం పవిత్ర స్నానం చేసి, ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలుంటాయి. 
 
కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం పూట సాయంత్రం వేళ దీపాలు వెలిగించడం వల్ల సిరిసంపదలు పెరుగుతాయనీ, అదృష్టం కలిసొస్తుంది. పూజ తర్వాత.. దానాలు చేసేవారికి.. పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు