కార్తీక అమావాస్యను భౌమవతి అమావాస్య అంటారు. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది. మంగళవారం అమావాస్య రావడం అనేది చాలా అరుదు. ఈ పవిత్రమైన రోజున అంగారక గ్రహాన్ని, హనుమంతుడిని పూజించడం వల్ల వ్యాధులన్నీ నయమవుతాయి.
అప్పుల బాధ తొలగిపోతుంది. ఈ రోజున శివయ్యను బిల్వ పత్రాలతో పూజించి, శ్రీ మహా విష్ణువును తులసి ఆకులతో పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో డిసెంబర్ 12వ తేదీన మంగళవారం ఉదయం 6:24 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత రోజు అంటే డిసెంబర్ 13వ తేదీన బుధవారం తెల్లవారుజామున 5:01 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున మట్టి దీపాలు, ఆహార వస్తువులు, బట్టలను దానధర్మాలు చేయాలి. అమావాస్య రోజున సంధ్యా వేళలో సూర్యాస్తమయం ముగిశాక చీకటి పడిన తర్వాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.