అయ్యప్ప దర్శనాలను ఒక గంట ముందుగానే ప్రారంభించడం వల్ల మరింత మంది భక్తులకు స్వామి దర్శనం కలుగుతుందని, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. దీంతో పాటు భక్తుల రద్దీ కూడా కొంతమేరకు తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ప్రతి రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల మంది బుకింగ్‌లు స్పాట్‌లో 30 వేల బుకింగ్స్‌లో ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించే ఐజీ స్పర్జన్ కుమార్ తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలకు కాస్త ఆటంకం కలుగుతుందని చెప్పారు.