శనివారం పూట రోజంతా వ్రతమాచరించి.. సాయంత్రం పూట ప్రదోష సమయాన శివాలయ దర్శనం చేయాలి. ప్రదోష సమయంలో శివాలయాల్లో జరిగే ప్రత్యేక అభిషేకాల్లో పాల్గొనాలి. శివునికి పాలు, పెరుగు, చందనం, పన్నీర్, విభూతి వంటితో అభిషేకం చేయించాలి. అలాగే బిల్వం, తామర పువ్వులతో అర్చన చేశాక ఆలయ ప్రదక్షణ చేయాలి. అభిషేకం కోసం నూనె, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు వంటివి ఇవ్వడం చేయొచ్చు. నందీశ్వరునికి అభిషేకంతో పాటు ఈశ్వరునికి జరిగే అభిషేకాలను వీక్షించాలి.
అలా ప్రదోషకాలం జరిగే అభిషేకాలు.. వాటి ఫలితాలేంటో తెలుసుకుందాం..
పాలు- వ్యాధులు తీరిపోతాయి. ఆయుర్దాయం పెరుగుతుంది.