శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని..?

మంగళవారం, 24 ఆగస్టు 2021 (00:05 IST)
శ్రావణమాసం మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు. 
 
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’.
 
శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ. పండు, తాంబూలంతో వాయనాలిస్తారు.. కుదిరితే అందరి ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు.. లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు.
 
తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. మంగళగౌరీవ్రతమును ఆచరించే అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగళిగా వర్ధిల్లిందని పురాణాలు చెబుతు న్నాయి. అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు