ప్రదోషం రోజున, సంధ్యా కాలం పూజలు చేస్తుంటారు. ఈ సమయంలో ప్రార్థనలు, పూజలు జరుపుకుంటారు. సూర్యాస్తమయానికి ఒక గంట ముందు, భక్తులు స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు.
ఈ ప్రదోష కాలంలో శివునికి ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలు జరుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలతో అభిషేకాలు చేయిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. బిల్వార్చనతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.