ప్రపంచ కుబేరులైన బెజోస్‌, ఎలోన్ మస్క్‌లను వెనక్కి నెట్టిన అదానీ

శుక్రవారం, 12 మార్చి 2021 (18:58 IST)
Adani
భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపాదన శరవేగంగా దూసుకెళ్తోంది. 2021లో అయితే ప్రపంచ కుబేరులైన బెజోస్‌, ఎలోన్ మస్క్‌ల కంటే అదానీ సంపాదనే ఎక్కువ ఉండటం గమనార్హం.

పోర్టుల నుంచి విద్యుత్ ప్లాంట్ల వరకూ వివిధ రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ సంపాదన.. ఈ ఏడాది అక్షరాలా 1620 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.18 లక్షల కోట్లు) కావడం విశేషం. దీంతో ఆయన మొత్తం సంపద 5000 కోట్ల డాలర్లు (సుమారు రూ.3.64 లక్షల కోట్లు)కు చేరింది. 
 
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన సమాచారం ఇది. ఈ ఏడాది ఒక్క కంపెనీ తప్ప మిగతా అన్ని అదానీ కంపెనీ షేర్లు 50 శాతం మేర పెరిగాయి. ఇక ఆసియాలోనే సంపన్నుడైన అంబానీ సంపాదన 2021లో 810 కోట్ల డాలర్లు (సుమారు రూ.59 వేల కోట్లు)గా ఉంది. అదానీతో పోలిస్తే ఇది సగమే.
 
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 96 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 90 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ 79 శాతం, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ 52 శాతానికిపైగా, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 12 శాతం పెరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు