పారిజాత చెట్టును సోమవారం పూజిస్తే..? (video)

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (05:00 IST)
Parijatha flower
పురాణాల ప్రకారం, పాల సముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు. ఈ చెట్టు మీద కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును ఇంద్రుడు స్వర్గం నుంచి భువికి తీసుకొచ్చినట్లు చాలామంది నమ్ముతారు. విష్ణువు కోరిక మేరకు ఇంద్రుడు మానవజాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత చెట్టును భూమికి పంపాడు. ఈ పవిత్ర వృక్షం యూపీలోని పరాబంకి సమీపంలోని కిందూర్ గ్రామంలో ఉంది. 
 
పారిజాత చెట్టుతో సంబంధం ఉన్న మరొక పురాణం ఉంది, మహాభారతంలో పాండవులు తన తల్లి కుంతితో కలిసి అడవిలో నివసించినప్పుడు, శివుడిని ఆరాధించడానికి కుంతికి పువ్వులు అందుబాటులో లేవు. ఆ విధంగా అర్జునుడు దేవేంద్రుడిని ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరాడు. తన కొడుకు కోరిక మేరకు ఇంద్రుడు పారిజాత చెట్టును కూడా ఇచ్చాడు. 
 
అలా భూమికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌లో ఉండే ఈ చెట్టును ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైన చెట్టు అని వారి ప్రగాఢ విశ్వాసం. ఈ చెట్టుకి కాసే పువ్వులు చాలా అందంగా బంగారం రంగు-తెలుపు రంగులో కలిసిపోయి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే సోమవారం పూట ఈ చెట్టును పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఈశ్వరానుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు