06-01-2019 నుంచి 12-01-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

శనివారం, 5 జనవరి 2019 (22:18 IST)
కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో గురు, శుక్రులు, ధనస్సులో రవి, బుధులు, మకరంలో కేతువు, మీనంలో కుజుడు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలో చంద్రుడు. 7వ తేదీన చంద్ర దర్శనం. ముఖ్యమైన పనులకు తదియ, బుధవారం శుభదాయకం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు, పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. శనివారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలకమైన చర్చల్లో పాల్గొంటారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. పనులు తేలికగా పూర్తవుతాయి. నిర్మాణాలు, మరమ్మత్తులు చురుకుగా సాగుతాయి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరంలో మీ కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. పందాలు, పోటీలు ఉత్సాహాన్నిస్తాయి.  
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ద్వితీయార్ధం ఆశాజనకం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయ. సంతానం రాక సంతోషం కలిగిస్తుంది. ఆలోచనులు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆది, సోమ వారాల్లో పనులు మొండిగా పూర్తిచేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. సంప్రదింపులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వాహన చోదకులకు అవస్థతలు తప్పవు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధనమూలక సమస్యలెదురవుతాయి. సన్నిహితుల సాయం అందిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తికాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగాలి. వేడుకల్లో పాల్గొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లకు ఆశాజనకం. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధువులు దూరమవుతారు. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. ఓర్పుతో మెలగాలి. గురు వారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు స్వీకరిస్తారు. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభదాయకం. ప్రశంసలు అందుకుంటారు. పోటీలు, పందాలు ఉల్లాసం కలిగిస్తాయి.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశయసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మంగళ, శని వారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితో రాణిస్తారు. బంధుత్వాలు బలపడుతాయి. వేడుకలను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తికాగలవు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. గురు, శుక్ర వారాల్లో సంతానం నిరుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుత్సాహం వీడి ఉద్యోయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఆటంకాలెదురవుతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు బలపడుతాయి. మీ జోక్యం అనివార్యం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఈ వారం ఖర్చులు విపరీతం. అయిన వారి కోసం వ్యయం చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహ సంబంధాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ శ్రీమతి తీరును గమనించి మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానం రాక ఉత్సాహన్నిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహనం చెందుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అవసరాలకు ధనం సర్దుబాటు కాగలదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుకాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. లైసెన్సులు, పర్మిట్‌ల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలు, పందాల్లో పాల్గొంటారు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి. పనులు హడావుడిగా ముగిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బాధ్యతలు అధికమవుతాయి. ఆది, సోమ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిరువ్యాపారులకు సామాన్యం. ఆశావహ దృక్పధంతో ఉద్యోగయత్నం సాగించండి. అధికారులకు స్థానచలనం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహార దక్షతతో రాణిస్తారు. సర్వత్రా అనుకూలతలున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కివస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవదు. పనులు వేగవంతమవుతాయి. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చులు ఫలిస్తాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వేడుకలు, వినోదాల్లో మితంగా ఉండాలి. క్రీడాకారులకు నిరుత్సాహం తగదు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు ఫలిస్తాయి. నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. కృషి ఫలిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. అయిన వారి కోసం వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. గురు, శుక్ర వారాల్లో ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు