అందులోనే చిన్నపాటి ఎర్రచందనం ముక్కను వుంచి.. పూజించాలి. అగరవత్తులతో పూజించాలి. తర్వాత కర్పూరంతో దీపారాధన చేయాలి. నైవేద్యంగా బెల్లం ముక్క, పంచదార లేదంటే.. ఖర్జూర పండ్లను.. సౌలభ్యానికి అనువుగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇలా దీపారాధన పూర్తయ్యాక.. ఎర్రటి వస్త్రాన్ని మూటగట్టి.. కళ్లకు అద్దుకుని.. ధనస్థానం వద్ద వుంచాలి.
నెల తర్వాత అలాగే అమావాస్య దాటిన మొదటి మంగళవారం కొత్త ఎరుపు వస్త్రంతో ఐదు గోమతి చక్రాలు, ఎరుపు చందనం ముక్క, గులాబీ పువ్వులు, కుంకుమ వుంచి పూజ చేసి.. ధనస్థానంలో వుంచాలి. పాత ఎరుపు వస్త్రంలో వున్న సామగ్రిని ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో వదిలేయాలి. మురికిగా వున్న నీటిలో ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని పారేయడం చేయకూడదు.