శ్రీ నరసింహ స్వామిని ఇలా పూజిస్తే రుణబాధలుండవు తెలుసా?

మంగళవారం, 29 మార్చి 2022 (19:46 IST)
శ్రీ నరసింహ స్వామి రుద్రమూర్తి అయినా శీఘ్రముగా వరాలిచ్చే వేలుపు. ఇంకా రుణ బాధలు తొలగి పోవడానికి నృసింహ స్తోత్రం పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని రోజూ పఠించే వారికి రుణబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుభఫలితాలు చేకూరుతాయి. 
 
ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నే నమః 
రుణ విమోచన నరసింహ స్తోత్రం 
దేవతా కార్య సిద్యర్థం సభాస్తంభ సముద్భవమ్
శ్రీ నృసింహం మహవీరం నమామి ఋణముక్తయే
లక్ష్యాలింగత వామాంగం భక్తానాం వరదాయకమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనానాశనమ్
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
సింహనాదేన మహతా దిగ్ధంతిభయనాశనమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
ప్రహ్లాద వరదం శ్రీ శం దైత్యేశ్వర విదారిణమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్  
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
వేదవేదాంత యజ్ఞశం బ్రహ్మ రుద్రాది వందితమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే
య ఇదం పఠతే నిత్యం రుణమోచన సంజ్ఞితమ్
అనృణే జాయతే సత్యొ ధనం శీఘ్ర మాప్నుయాత్.
 
అలాగే పూర్వ జన్మ పాపాలు తొలగించుకోవడం.. తెలిసీ తెలియని పాపాల నుంచి గట్టెక్కాలంటే.. మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని పూజించాలి. పాపాలు తొలగిపోవాలంటే.. భక్తిని మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో.. నరసింహ స్వామిని శరణు కోరితే.. పాపాలు తొలగిపోవడం తద్వారా ఈతిబాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయొచ్చు. 
 
తూర్పు దిశలో ఇంట్లోని పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి పూజించాలి. రోజూ శుచిగా స్నానమాచరించి.. నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా ఈతిబాధలుండవు.
 
ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు దీపం వెలిగించి.. మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చేయాలి. ఈ ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహ స్వామిని ఆరాధించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు