శని చంద్ర గ్రహణం 2024: ఈ రాత్రి అరుదైన ఖగోళ ఘటన... మిస్ చేసుకోవద్దు..

సెల్వి

బుధవారం, 24 జులై 2024 (19:54 IST)
శని చంద్ర గ్రహణం అని పిలవబడే అరుదైన ఖగోళ సంఘటన బుధవారం రాత్రి భారతదేశం అంతటా చోటుచేసుకోనుంది. దాదాపు ప్రతి 18 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ విశిష్ట ఘటన ద్వారా, శని గ్రహం ముందు చంద్రుడు ప్రయాణిస్తున్నట్లు పరిశీలకులు వీక్షించవచ్చు.  
 
శని చంద్రగ్రహణం ఈరోజు రాత్రి, జూలై 24న జరుగనుంది. 
శని వలయంగా కనిపిస్తుంది. 
ప్రారంభం: జూలై 25, 2024, ఉదయం 1:30 గంటలకు 
ముగింపు: జూలై 25, 2024, ఉదయం 2:25 గంటలకు
 
దీనిని శని చంద్ర గ్రహణంగా అని పిలుస్తారు. చంద్రుడు నేరుగా శని గ్రహానికి ఎదురుగా కదులుతున్నప్పుడు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ ప్రత్యేక గ్రహణం మకరం, కుంభం, మీనం, కర్కాటకం, వృశ్చికం అనే ఐదు రాశులను ప్రభావితం చేస్తుంది.
 
శని చంద్ర గ్రహణాన్ని భారతదేశంతో పాటు, శ్రీలంక, మయన్మార్, చైనా, జపాన్‌లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఉత్తమ వీక్షణ అనుభవం కోసం, తక్కువ కాంతి కాలుష్యం ఉన్న ప్రదేశాన్ని కనుగొనడం మంచిది. 
 
అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో, గ్రహణాన్ని కంటితో గమనించవచ్చు. అయినప్పటికీ టెలిస్కోప్ లేదా బైనాక్యులర్‌లను ఉపయోగించడం వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రాత్రి శని చంద్రగ్రహణాన్ని చూసే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు