ఈ మార్పు వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని వంటి శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మార్పుతో వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులు లాభపడుతాయి. ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి, ఆరోగ్యం, ఉద్యోగంలో పురోగతి వుంటుంది. ఈ శని స్థానం మారటం వల్ల వృషభ రాశివారికి శని లాభ స్థానంలోకి వస్తున్నందువల్ల రెండున్నర ఏళ్ల పాటు జీవితంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి.
అలాగే తుల రాశి వారికి అనుకూలం. ఇప్పటి వరకూ పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఆరవ స్థానమైన మీన రాశిలోకి మారడం వల్ల ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారాల్లోనూ తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది.