సమస్త జాతక దోషాలను తొలగించే శని ప్రదోషం గురించి తెలుసా?

బుధవారం, 1 ఆగస్టు 2018 (17:37 IST)
నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం, మహా ప్రదోషం, ప్రళయ ప్రదోషం అనే ఐదు విధాలుగా ప్రదోషాన్ని విభజించారు. ప్రదోష కాలమం సమస్త దోషాలను, పాపాలను తొలగించే సమయం. జాతకంలో ఏదేనీ దోషాలు వుంటే.. వివాహ దోషాలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఏర్పడితే.. అలాంటి వారు శనివారం పూట వచ్చే ప్రదోషం.. (అంటే దాన్ని శనిప్రదోషం అంటారు) రోజున శివరాధన చేయడం ద్వారా తొలగించుకోవచ్చు. 
 
జాతకంలోని ఎలాంటి దోషాన్నైనా శివుడు తొలగిస్తాడు. అందుకు ప్రదోష కాలంలో శివార్చన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గత జన్మలలో చేసిన పాపాలు కూడా ప్రదోషకాల పూజలో పాల్గొంటే తొలగిపోతాయి. అలాగే ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.

రోజూ సూర్యాస్తమనానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు.. అంటే మొత్తం 48 నిమిషాలను ప్రదోష కాలం అంటారు. ఇది నిత్య ప్రదోషకాలం. కృష్ణపక్ష త్రయోదశిని పక్ష ప్రదోషం అంటారు. శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషం అంటారు ముఖ్యంగా శనివారం, శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మహా ప్రదోషం అంటారు. దీన్నే శని మహాప్రదోషం అని పిలుస్తారు. 
 
దేవతలు పాలకడలిని చిలికినప్పుడు వెలికి వచ్చిన విషాన్ని శివ పరమాత్ముడు తీసుకుని.. లోకాన్ని సంరక్షించిన రోజును శనిప్రదోషంగా పిలుస్తారు. సంవత్సరమంతా వచ్చే ప్రదోషాలకు ఉపవాసం వుండకపోయినా పర్లేదు. కానీ శనివారం వచ్చే ప్రదోషం రోజున ఉపవసించి.. శివార్చన చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని.. ఆ సమయంలో దేవాలయాల్లో వెలసిన మహేశ్వరుడిని స్తుతించడం, ఆరాధించడం, పూజించడం, అభిషేకించడం ద్వారా జాతకదోషాలు పూర్తిగా తొలగిపోతాయని విశ్వాసం. ప్రదోష కాల పూజ చేస్తే.. శివుడిని మాత్రమే కాదు.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని విశ్వాసం.
 
ఇంకా నందీశ్వరుడికి తగిన గౌరవం ఇచ్చేది ప్రదోషకాల పూజనే. నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నందీశ్వరుడిని ప్రదోష కాలంలో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అన్ని చదువులున్నా.. నందీశ్వరుడు వినయంతో వుంటాడని.. శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నందీశ్వరుడు నివృత్తి చేస్తాడని నమ్మకం. ప్రదోషకాల పూజలో పాల్గొంటే బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం దక్కుతుంది. 
 
ప్రదోష కాలంలో ఆవుపాలతో శివునికి అభిషేకం చేయించి, బిల్వ పత్రాలు, శంఖుపూలను సమర్పించుకుని స్తుతిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం 4.30 నుంచి ఆరుగంట వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో శివార్చన ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 (2018), అక్టోబర్ ఆరో తేదీన శని ప్రదోష వస్తోంది. ఈ శని ప్రదోషాల్లో స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు