Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

సెల్వి

శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (10:19 IST)
Skandha Mata
నవరాత్రులు సందర్భంగా స్కంధమాతను ఐదవ రోజు పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో కుమార స్వామికి ప్రాధాన్యత ఇస్తారు. స్కంధమాత సింహవాహనం మీద నాలుగు చేతులతో అలరారుతూ వుంటుంది. రెండు చేతులా కమలాలను ధరించి, ఒక చేతితో అభయాన్ని అందిస్తూ.. మరో చేతితో కార్తికేయుడిని పట్టుకుని ఉండే అమ్మవారిగా ఆమె దర్శనమిస్తుంది. స్కంధమాతను పూజిస్తే.. ఇహంలో జ్ఞానం, పరంలో మోక్షం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆమెను పూజిస్తే కార్తీకేయుడి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
కేవలం దేవీ నవరాత్రుల సందర్భంలోనే కాకుండా, స్కంధమాతను ఎప్పుడైనా పూజించవచ్చు. ఓం దేవి స్కంధమాతాయై నమః అనే మంత్రంతో ఆమెను స్తుతించడం వల్ల భక్తుల జీవితాలలో వుండే ఎలాంటి కష్టాన్నైనా.. ఈ తల్లీబిడ్డలు గట్టెక్కిస్తారని విశ్వాసం. 2025 సంవత్సరానికి, 5వ రోజు పవిత్ర రంగు ఆకుపచ్చ. 
 
అందుకే ఈ రోజున ఆకుపచ్చను ధరించడం మంచిది. ఆకుపచ్చ రంగు సామరస్యం, పెరుగుదల, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించడం స్కందమాత పోషణ శక్తికి అనుగుణంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు