ఆగస్టు 16 శ్రావణ అమావాస్య: ఉపవాసం.. సముద్ర స్నానం చేస్తే?

సోమవారం, 14 ఆగస్టు 2023 (22:36 IST)
ఆగస్టు 16, 2023 (బుధవారం) శ్రావణ అమావాస్య. ఈ రోజున పితురలను పూజిస్తే వంశాభివృద్ధి చేకూరుతుంది. ఆ రోజు నిష్ఠనియమాలతో పూజలు చేస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఆ రోజు ఉదయం నిద్రలేచి, సమీపంలోని నదిలో లేదా చెరువులో స్నానం చేసి, పితృదేవతలకు పూర్వీకులకు తర్పణం చేయండి. నదులు, చెరువులు, సముద్ర తీరాన తర్పణం ఇవ్వవచ్చు. 
 
ఆపై వృద్ధులకు, పేదలకు పెద్దగా కాకపోయినా కనీసం కొందరికైనా అన్నదానం చేయాలి. అమావాస్య రోజున, ఇంట్లో మహిళలు స్నానాలు చేసి, ఉపవసించి పితరులకు ఇష్టమైన ఆహారాలు, పదార్ధాలను సిద్ధం చేస్తారు. ఆ రోజు వంటల్లో అన్ని రకాల కూరగాయలు ఉండాలి. 
 
ఉపవాసం ఉన్నవారు ఉదయం పూట ఏమీ తినకూడదు. దీపం వెలిగించి, ధూపం వెలిగించి, పితరులను స్మరించుకోవాలి. అమావాస్య నాడు ఉపవాసం ఉండేవారు ఉదయం పూట భోజనం చేయకూడదు. కానీ పగలు తినవచ్చు. రాత్రిపూట పాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. అమావాస్య వ్రతాన్ని సరిగ్గా ఆచరించడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పూజకు తర్వాత వండిన అన్నాన్ని కాకులకు పెట్టి.. పేదలకు కడుపు నిండా ఆహారం పెట్టాలి. 
 
అలాగే ఈ ఏడాది శ్రావణ మాసంలో వచ్చే ఈ అమావాస్య విశిష్టతో కూడింది. పితృదేవతలను ఈ రోజున శ్రద్ధగా పూజించడం ద్వారా తమ పూర్వీకుల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. 
 
అమావాస్య సమయంలో సముద్రంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది. శ్రావణ అమావాస్య రోజున రామేశ్వరం, రామనాథస్వామి దేవాలయంలో పూజలు చేస్తే పితృదేవతలకు మోక్షం సిద్ధిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు